https://oktelugu.com/

తెలంగాణ, ఏపీ జలయుద్ధంపై కేంద్రం కీలక ప్రకటన

ఏపీ తెలంగాణ మధ్య జలయుద్ధ ముదిరింది. రోజురోజుకు తీవ్రమవుతోంది. కేంద్రం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మరింత చిచ్చుపెడుతోంది. కేంద్రం నిర్ణయాన్ని ఏపీ స్వాగతించగా.. తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఏపీకి అనుకూలంగా వ్యవహిస్తోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ జల జగడంపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ప్రశ్న లేవనెత్తారు. కృష్ణా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 22, 2021 / 12:11 PM IST
    Follow us on

    ఏపీ తెలంగాణ మధ్య జలయుద్ధ ముదిరింది. రోజురోజుకు తీవ్రమవుతోంది. కేంద్రం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మరింత చిచ్చుపెడుతోంది. కేంద్రం నిర్ణయాన్ని ఏపీ స్వాగతించగా.. తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఏపీకి అనుకూలంగా వ్యవహిస్తోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు.

    ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ జల జగడంపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ప్రశ్న లేవనెత్తారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని.. వాటి వల్ల ఏపీకి అన్యాయం జరుగుతోందిన అన్నారు. ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి పేరిట ప్రాజెక్టుల నుంచి నీటిని వృథా చేస్తోందని ఆరోపించారు.

    దీనిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ సమాధానమిచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకునేందుకే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని స్పష్టం చేశారు.

    ఇక పోలవరం విషయంపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేశారు. వెల్ లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ ఎంపీలు నినాదాలు చేస్తుండగానే స్పీకర్ పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా తమ సమస్యలపై ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం నడుమ స్పీకర్ సభను వాయిదా వేశారు.