పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు

కరోనా మహమ్మారి దేశమంతటా వేగంగా విస్తరిస్తుంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షల మార్కును కూడా దాటింది. గత రెండు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నెేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహారం ధాన్యాలను సమకూర్చనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. ఒక్కో లబ్భిదారుకు […]

Written By: Suresh, Updated On : April 23, 2021 4:38 pm
Follow us on

కరోనా మహమ్మారి దేశమంతటా వేగంగా విస్తరిస్తుంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షల మార్కును కూడా దాటింది. గత రెండు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నెేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహారం ధాన్యాలను సమకూర్చనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. ఒక్కో లబ్భిదారుకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందించనున్నట్లు వెల్లడించింది.