
కారు యజమాని నిర్లక్ష్యానికి 11 నెలల బాలుడు బలయ్యాడు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరామ్ నగర్ బీ బ్లాక్ లో నివాసం ఉండే తోట వెంకట శివ ప్రసాద్ కుమారుడు తోట జశ్వంత్ (11 నెలలు) మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అదే బ్లాక్ కు చెందిన తాటి కిరణ్ నిర్లక్ష్యంగా కారును నడుపుతూ జశ్వంత్ ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక జిల్లా దవాఖానకు తీసుకువెళ్లగా వైద్య పరీక్షల నిమిత్తం కొత్తగూడ టెస్లాకు తరలించారు. పరీక్షల అనంతరం దవాఖానకు తీసుకురాగా అప్పటికే బాబు చనిపోయాడు.