
మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మరణించారు. థానేలోని ప్రైమ్ క్రిటికేర్ ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజాబున అగ్నిప్రమాదం చోటుచుసుకుంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్, ఇతర బాదితులను మరో ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.