
ఆపిల్ యొక్క అతి పెద్ద ఈవెంట్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్పరెన్స్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ జూన్ 11 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనున్నది. ఈసారి పెరుగుతున్న కరోనా ఇన్ ఫెక్షన్ ను దృష్టిలో ఉంచుకుని వర్చువల్ విధానంలో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఐఫోన్ నుంచి ఆపిల్ వాచ్ వరకు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లను విడుదల చేయవచ్చని మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. అలాగే అనేక కొత్త ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.