
ఒలింపిక్స్ లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కు ఏపీ ప్రభుత్వం రూ. 30 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. సింధు టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర క్రీడా విధానంలో భాగంగా సింధుకు ఆ నగదు బహుమతి ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.