
సిద్ధిపేటలో టీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచిన కొందరు తమ రౌడీయీజాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలో ఓ వార్డు కౌన్సిలర్ తనకు వరుసకు తమ్ముడ్యే వ్యక్తిపై కుటుంబసమేతంగా దాడి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దిపేట 26వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన ప్రవీణ్, శ్రావన్ పై దాడి చేశాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రావణ్ తన స్నేహితులతో కలిసి సెల్ఫీ దిగుతుండగా అటుగా వెళుతున్న కౌన్సిలర్ వారిని దూషించాడు. కౌన్సిలర్ కర్రతో శ్రావణ్, అతని స్నేహితులను చితకబాదాడు. తన అన్నను కొట్టవద్దని వెళ్లిన శ్రావన్ తమ్ముడిని కూడా కొట్టారు.