
తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఆస్ట్రోనాట్స్ తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అతని సోదరుడు మార్క్ బెజోస్ తో కలిసి ప్రయాణించనున్నాడు. అయితే తాజాగా జెఫ్ బెజోస్ కలిసి అంతరిక్ష యాత్ర చేయడానికి మరో సీట్ కోసం ప్రత్యేక్ష వేలం జరిగింది. ఈ ప్రత్యేక్ష వేలం ప్రారంభమైన నాలుగు నిమిషాల్లో బిడ్లు 20 మిలియన్ల డాలర్లకు పైగా కోట్ చేశారు. చివరికి వేలం ప్రారంభమైన 7 నిమిషాల తర్వాత 28 మిలియన్ డాలర్ల (205 కోట్లు) బిడ్డింగ్ ముగిసింది. అయితే సంస్థ అతని పేరు బయటికి వెల్లడించలేదు. జూలై 20న వెస్ట్ టెక్సాస్ నుంచి బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ బూస్టర్ అంతరిక్ష కక్ష్యలోకి వెళ్తుంది. కాగా ఈ ప్రయోగం కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తి కానుంది.