ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, అండ్ ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా అద్భుతమే, కొత్త జనరేషన్ కు ఆ మాటలే గొప్ప పాఠాలు. అందుకే ‘పూరీ మ్యూజింగ్స్’కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్రపంచంలోని వింతలను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న ఈ బోల్డ్ డైరెక్టర్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు.
టాపిక్ పేరు ‘లిక్ ది బౌల్’. పూరి మాటల్లోనే.. ‘బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వాళ్లను బుద్ధిస్టులు అని పిలుస్తాం. గమనించారా ? వాళ్ల చేతుల్లో ఒక పాత్ర ఉంటుంది. దాన్నే బిక్షాటన పాత్ర అని పిలుచుకుంటూ ఉంటారు. ఆ పాత్రలో కేవలం ఒకసారి ఒక మనిషికి సరిపోయే ఫుడ్ మాత్రమే పడుతుంది. అంటే, ఎదురు ఎంత ఆహారం ఉన్నా.. ఒక పూట ఒక మనిషి కడుపు నింపడానికి మాత్రమే ఆ పాత్ర ఆహారాన్ని నింపగలదు.
ఈ కాన్సెప్ట్ ని కనిపెట్టింది బుద్ధుడే. బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్లు, ఒక రోజులో ఒక్కటి లేదా రెండు సార్లు మాత్రమే తింటారు. మిగతా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరు. ఉపవాసం ఉంటారు. అంటే దాదాపు 18 గంటలపాటు వాళ్లు ఉపవాసం చేస్తారట. అందుకే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి ఉపవాసాలు మనం కూడా చేస్తే ఎంతో బాగుంటుంది కదా. అందుకే, ప్లేట్ లో ఆహారం పెట్టుకుని తినే బదులు గిన్నె పెట్టుకుని తినండి.
గిన్నె పెట్టుకుని తినడం వల్ల ఫుడ్ కంట్రోల్డ్ గా తింటారు. మనకు వచ్చే జబ్బులకు కారణం అధికంగా తీసుకునే ఆహారం మాత్రమే. మీరు తిండి తగ్గించాలంటే ఓరియాకీ సెట్ అంటే బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్లు వాడే గిన్నెలు అన్నమాట, అవి వాడండి. ఐతే, మనలో చాలామంది తక్కువ తింటే నీరసం వస్తుందని అనుకుంటారు. అలా అనుకోకండి, మీరు బలంగానే ఉంటారు’ అంటూ పూరీ కొత్త పాఠం వివరించాడు.
