https://oktelugu.com/

ఆదర్శ నాయకురాలి నుండి ఇలాంటి వీడియోనా ?

సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పుడు పద్దతిగా నడుచుకోవాలి. హరియాణాకు చెందిన బీజేపీ నేత మరియు నటి అయిన సొనాలీ ఫొగట్‌ కు మాత్రం ఇవేమి పట్టినట్టు లేవు. ఆమె హాట్ ఫోజులతో మరోసారి వార్తల్లో నిలిచి.. ప్రస్తుతం వైరల్ అవుతుంది. లాక్ డౌన్ టైం కాబట్టి, అలాగే హరియాణాలో రాజకీయాలకు సంబంధించి కూడా అంత అర్జెంట్ గా చేసే పనులు కూడా ఏమీ లేవు కాబట్టి, ఈ ముదురు భామ తనదైన శైలిలో రెచ్చిపోతుంది. ఈ క్రమంలో […]

Written By:
  • admin
  • , Updated On : June 13, 2021 / 04:27 PM IST
    Follow us on

    సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పుడు పద్దతిగా నడుచుకోవాలి. హరియాణాకు చెందిన బీజేపీ నేత మరియు నటి అయిన సొనాలీ ఫొగట్‌ కు మాత్రం ఇవేమి పట్టినట్టు లేవు. ఆమె హాట్ ఫోజులతో మరోసారి వార్తల్లో నిలిచి.. ప్రస్తుతం వైరల్ అవుతుంది. లాక్ డౌన్ టైం కాబట్టి, అలాగే హరియాణాలో రాజకీయాలకు సంబంధించి కూడా అంత అర్జెంట్ గా చేసే పనులు కూడా ఏమీ లేవు కాబట్టి, ఈ ముదురు భామ తనదైన శైలిలో రెచ్చిపోతుంది.

    ఈ క్రమంలో ఓ హిందీ సాంగ్ కు తనకు మాత్రమే సాధ్యమై స్టెప్పులేసి అదరగొట్టింది. దాంతో ఈ డ్యాన్స్‌ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేసి లైక్ చేస్తున్నారు. ఈ వీడియోని సొనాలీ ఫొగట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగానే ఆమె ఫాలోవర్స్ నుండి విపరీతమైన స్పందన వచ్చింది. సుమారు మూడు నెలల తర్వాత వ్యాయామం మొదలు పెట్టాను అని ఈ వీడియోకి చిన్నపాటి క్యాప్షన్‌ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ.

    ఇక వీడియో విషయానికి వస్తే… ఈ వీడియోలో బూడిద రంగు టైట్‌ డ్రెస్ ను ధరించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పైగా సొనాలీ ఫొగట్‌ ఎంతో ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేసింది. అయితే సొనాలీ ఫొగట్‌ నుండి ఇలాంటి వీడియోని ఆశించని ఆమె అభిమానులు సీరియస్ అవుతూ ‘ఆ బట్టలేంటి? ఒక మంచి హోదాలో ఉండి ఇలాంటి గెంతులు ఎవరైనా వేస్తారా ?’ అంటూ ఆమె పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

    అయినా , రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్న ఈ భామ, ఇలా ఎందుకు చేసిందో ? అసలు ఒక నాయకురాలిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సొనాలీ ఫొగట్‌, ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయడమేంటి?. ఆమె ఫాలోవర్స్ కూడా ఆమెను ఇలాగే దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో సొనాలీ వెంటనే ఆ డ్యాన్స్‌ వీడియోను మళ్ళీ డిలీట్‌ చేసింది. సొనాలీ ఫొగట్‌ హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లోనూ పాల్గొంది.