
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) విభాగంలోకి రిటైల్, టోకు వాణిజ్యాన్ని చేర్చడాన్ని ఓ మైలురాయిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. చిరు వ్యాపారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు పలు ప్రయోజనాలు అందనున్నాయన్నారు. రిటైల్, టోకు వాణిజ్యాన్ని ఎంఎస్ఎంఈలో భాగం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ మైలురాయిగా నిలవనుంది. దీంతో మన వ్యాపారులకు ఆర్థిక వనరులు సులభంగా సమకూరనున్నాయి అని మోదీ ట్వీట్ చేశారు.