అయితే ఆ వివాహంలో ఆమె తీసుకున్న ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో చిన్మయి చీర కట్టుకున్న విధానం కారణంగా ఆమె బేబి బంప్ తో ఉన్నట్లు గాసిప్ రాయుళ్ళుకు అనుమానం కలిగింది. ఇక దాంతో చిన్మయి గర్భవతి అంటూ.. ఆమె త్వరలోనే తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ నానా హడావుడి చేశారు.
నెట్టింట్లో, యూట్యూబ్ లో ఇలా ఎక్కడ పట్టినా పుకార్లు రేగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ రూమర్స్ చిన్మయి వరకు చేరాయి. ఈ పుకార్లు విని విసిగిపొయి వాటి పై స్పందించిన చిన్మయి తను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక సుధీర్ఘ మెసేజ్ కూడా రాసుకొచ్చింది.
‘ఈ ఫోటోలో నేను మడిసార్ ధరించాను. మడిసార్ కారణంగా నా పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది తప్ప, నేను గర్భవతిని కాదు. నా బేబీ బంప్ అంటూ యూట్యూబ్ ఛానల్స్ లో తప్పుడు హెడ్డింగ్ లు చూసి విసిగిపోయాను. మడిసార్ తో ఎక్కువగా నడవడం కారణంగా నా చీర బాగా వదులు అయ్యింది. అసలు నా పర్సనల్ లైఫ్ విషయాల గురించి ఫాలోవర్స్ తో షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికైనా ప్రెగ్నెన్సీ రూమర్స్ ను ఆపండి’ అని ఈ పుకార్ల పై సీరియస్ అయింది చిన్మయి.