https://oktelugu.com/

రేవంత్ కు చెక్ పెట్టడానికే షర్మిల ప్రణాళిక?

తెలంగాణలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోరాటంలో ముందుండగా తాజాగా వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డి సైతం తమ ప్రభావం చూపించే విధంగా పావులు కదుపుతున్నారు. రాష్టంలో అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ముఖ్యమంత్రి పీఠమే ద్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నారు. వైఎస్సార్ అభిమానులను తనవైపు తిప్పుకునే క్రమంలో షర్మిల నూతన పార్టీ ఆవిర్భావం చేయనుండగా రేవంత్ రెడ్డి కూడా వైఎస్ఆర్ అభిమానులు తమ వెంటే ఉన్నారని చెబుతూ కొత్త పంథాకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : July 3, 2021 / 04:51 PM IST
    Follow us on

    తెలంగాణలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోరాటంలో ముందుండగా తాజాగా వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డి సైతం తమ ప్రభావం చూపించే విధంగా పావులు కదుపుతున్నారు. రాష్టంలో అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ముఖ్యమంత్రి పీఠమే ద్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నారు. వైఎస్సార్ అభిమానులను తనవైపు తిప్పుకునే క్రమంలో షర్మిల నూతన పార్టీ ఆవిర్భావం చేయనుండగా రేవంత్ రెడ్డి కూడా వైఎస్ఆర్ అభిమానులు తమ వెంటే ఉన్నారని చెబుతూ కొత్త పంథాకు శ్రీకారం చుడుతున్నారు.

    జులై 7న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనుండగా 8న షర్మిల నూతన పార్టీని ప్రకటించనున్నారు. దీంతో రాష్ర్టంలో రాజకీయ వేడి పెరగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ, టీఆర్ఎస్ బాహాబాహీకి దిగుుతుండగా వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షర్మిల, రేవంత్ రెడ్డి లకు ఎస్సీ సామాజిక ఓటర్లపైనే గురి పెడుతున్నారు. వారు మా వెంటే ఉన్నారని చెప్పుకుంటూ పోటీ పడుతున్నారు. దీంతో ఓటర్లు ఎవరి పక్షం వహిస్తారో వేచిచూడాల్సిందే. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికే షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    షర్మిల ఈనెల 8న ఇడుపుల పాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీ ఆశయాల గురించి కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. పాదయాత్రపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రజాసమస్యల పరిష్కారానికి తనదైన పంథా అనుసరించే అవకాశాలున్నాయి. మొత్తానికి రాష్ర్టంలో బహుపార్టీల విధానంతో ఎన్నికల తంతు ఓ ప్రహసనంలా మారే సూచనలు కనిసిస్తున్నాయి.

    షర్మిల పార్టీ చిహ్నంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆకర్షణీయంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. జెండా రూపకల్పనపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. 2023 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జెండాలో పాలపిట్ల నీలిరంగుతో కూడి ఉండగా నీలి రంగు 20 శాతం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారని తెలుస్తోంది. షర్మిల తెలంగాణలో పాగా వేయాలని భావిస్తూ పార్టీని ముందుకు నడిపించే క్రమంలో పలురకాల ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.