Joe Biden: కాబూల్ ఎయిర్ పోర్ట్ పై ఉగ్రదాడులు జరగొచ్చు.. బైడెన్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికన్ల తరలింపు ఈనెల చివరలోగా పూర్తి అవుతుందని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అయితే రద్దీగా ఉన్న కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఖర్జాయ్ విమానాశ్రయానికి జనం భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. తాలిబన్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆగస్టు 31వ తేదీ లోపు కాబూల్ నుంచి జనాల తరలింపు ముగుస్తుందని బైడెన్ అన్నారు.