Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు సంభవిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెపథ్యంలో 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళలోని కొంకణ్ తీరం లక్ష దీవులు తమిళనాడు ఏపీ తెలంగాణ మీదుగా రుతుపవనాలు వస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్టోగ్రతలు తగ్గాయి. తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నింజాంబాద్, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారిచేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.