Heroine Archana : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ మంచి సబ్జెక్టులను కథలుగా ఎంచుకొని సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి గొప్ప గుర్తింపును సంపాదించాడు. ఇక ఇప్పుడు ‘షష్టిపూర్తి’ (Shashti Purthi) అనే సినిమాని చేస్తున్నాడు. పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ రేంజ్ లో నిర్వహిస్తున్నారు. ఇక షష్టిపూర్తి సినిమాలో రాజేంద్రప్రసాద్ కి జోడిగా ఒకప్పటి అందాల నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అర్చన నటించింది. ఇక ఇప్పుడు కూడా ఆమె ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది…ఇక రీసెంట్ గా ఆమె ఒక పోడ్ కాస్ట్ లో పాల్గొన్నప్పుడు ఒక సినిమాలో తను బ్లౌజు లేకుండా సినిమా మొత్తం నటించానని చెప్పింది.
Also Read : ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్ మాయం వెనుక అతడి హస్తం..? ఆధారాలతో సహా దొరికిపోయాడుగా!
భానుచందర్ హీరోగా ఆమె హీరోయిన్ గా వచ్చిన నిరీక్షణ (Neerikshana) సినిమాలో ట్రైబల్ ఏరియా లో నివసించే అమ్మాయి పాత్ర కోసం తను ఆ సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించి ఆ పాత్రకి ప్రాణం పోసిందట. అలాగే ఆ పాత్రలో చాలా పవిత్రత కూడా ఉందని ఇప్పుడున్నట్టుగా వల్గారిటీగా అప్పుడున్న దర్శకులు చూపించలేదంటూ అర్థం వచ్చేలా తను మాట్లాడింది.
మొత్తానికైతే ఆమె నటించిన ఆ పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా బ్లౌజ్ లేకుండా నటించడం అనేది అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించింది… ఇక ఇప్పటివరకు అలాంటి డేరింగ్ పాత్రను చేసిన నటీమణులు చాలా తక్కువ మంది ఉన్నారు.
బ్లౌస్ లేకుండా సినిమా అంతా చేయడం ఆ రోజుల్లో పెద్ద ఛాలెంజ్ కానీ ఆ పాత్రలో ఉన్న పవిత్రత కోసం నేనది చేసాను…
– #Archana #Shashtipoorthi #ShashtipoorthiOnMay30 pic.twitter.com/HFURdahJal— Rajesh Manne (@rajeshmanne1) May 27, 2025
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. మరి ఆమె రాజేంద్రప్రసాద్ జంట గా కలిసి చేసిన షష్టిపూర్తి సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది. తనకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని తీసుకొచ్చి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
