Telangana Municipal Elections Results: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భారీగా ఖర్చు పెడుతుంటారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో డబ్బు పరంగా.. వస్తువులపరంగా.. కానుకల పరంగా చేతికి ఎముకే లేదు అన్నట్టుగా ఖర్చు పెడతారు.
కొందరు మాత్రం చాలా విచిత్రంగా ఉంటారు. ఖర్చు పెట్టడానికి ముందుకు రారు. ప్రజల్లో అభిమానాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉంటారు. ఎన్నికల్లో విజయం సాధించడం మాత్రమే కాకుండా.. అదృష్టాన్ని తమ జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు. చివరికి జాక్పాట్ కొట్టి అందరికంటే భిన్నంగా కనిపిస్తుంటారు.
మూడోసారి.. ఇండిపెండెంట్ గా..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ మునిసిపాలిటీలో తాళ్ల శ్రీధర్ గౌడ్ ఇండిపెండెంట్ బరిలో ఉన్నాడు. ఇతడు ఇలా ఉండడం ఇది మూడవసారి. గతంలో రెండుసార్లు విజయం సాధించాడు. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ అందుకున్నాడు. 19వ వార్డ్ నుంచి ఇతడు పోటీ చేశాడు. 2014లో అప్పుడు దేవరకొండ నగర పంచాయతీగా ఉంది. ఆ సమయంలో పోటీ చేసిన శ్రీధర్ స్వతంత్ర అభ్యర్థిగా బిజెపి అభ్యర్థి మీద గెలిచాడు. 2020లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిపై 125 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో 211 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి మీద గెలిచాడు. ఇతడు బిఎన్ఆర్ బుల్లెట్స్ యూత్ అనే సంస్థను ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
ఇతడి అదృష్టం మామూలుగా లేదు
అతడి పేరు సయ్యద్ మహబూబ్ అలీ. 20 సంవత్సరాలకు కువైట్లో ఉంటున్నాడు. తెలంగాణ గోల్డెన్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశాడు.. భారతీయులకు అనేక రకాలుగా సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు.. పాస్ పోర్ట్, వీసా, ఉపాధి వంటివి కల్పిస్తున్నాడు. అదిలాబాదులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అతడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. తద్వారా కువైట్ నుంచి రాగానే.. బంగారు అవకాశం అందుకున్నాడు.
అప్పుడు బజ్జీలు అమ్మింది.. ఇప్పుడేమో
ఆమె పేరు నాగుబాయ్. ఆసిఫాబాద్ లో బజ్జీలు అమ్ముతుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుకోకుండా ఆమెకు అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 19వ వార్డులో పోటీ చేసి గెలిచింది. ఈమె గులాబీ పార్టీ తరఫున పోటీ చేసి తిరుగులేని విజయాన్ని అందుకుంది.
గులాబీ పార్టీ మద్దతుతో.. జనసేన నుంచి గెలుపు
ఆమె పేరు విజయలక్ష్మి. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల పురపాలకంలో 14వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసింది. గులాబీ పార్టీ మద్దతు ఇవ్వడంతో గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి మీద 29 ఓట్ల తేడాతో విజయం సాధించింది. విజయలక్ష్మి భర్త పేరు సరికొప్పుల నాగేశ్వరరావు. జనసేన హుజూర్ నగర్ ఇన్చార్జి వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లాకు అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు. విజయలక్ష్మి బీటెక్ వరకు చదువుకున్నారు. ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. భర్త ప్రోత్సాహం ఇవ్వడంతో రాజకీయాలలోకి వచ్చారు. ఇంటింటి ప్రచారం చేస్తూ విజయం సాధించారు.
ట్రాన్స్ జెండర్ అని హేళన చేశారు.. ఇప్పుడేమో కౌన్సిలర్ అయింది
ఆమె పేరు నాగిల సుధాకర్ అలియాస్ కావేరి. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగింది. కాంగ్రెస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి మీద 102 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ట్రాన్స్ జెండర్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుధాకర్ పేరు చర్చకు దారితీస్తోంది. సుధాకర్ తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు.