
మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనకు వార్త్లల్లో హల్ చల్ చేయడం కొత్తేమీ కాదు. అయినా ప్రస్తుతం ఆయనపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజీనామా చేసిన కొంతకాలంగా కనిపించకుండాపోయారు. దీంతో ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆయన తెరమరుగు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయేమోనని వెతుకుతున్నారు. ఆయన టీడీపీ ఉన్నట్టా? లేక పార్టీ మారారా? అనే విషయాలు ఎవరికి అర్థం కావడం లేదు.
మున్సిపల్ ఎన్నికలకు ముందు గంటా వైసీపీలోకి రావాలని ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి ఆహ్వానించారు. దీంతో గంటా నిశ్శబ్దం పాటించారు.దీంతో వైసీపీ అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ సాధించింది. తరువాత సాయిరెడ్డి ఏమి మాట్లాడలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం కోసమే సాయిరెడ్డి ఇలా మాట్లాడారని తెలిసింది. గంటా ప్రచారం బాగా చేస్తే వైసీపీకి నష్టం వస్తుందని భావించి సాయిరెడ్డి అలా మాట్లాడారని చెబుతున్నారు.
కార్పొరేషన్ ఎన్నికల తర్వాత సాయిరెడ్డి సైలెంట్ అయిపోయారు. ఎన్నికల వ్యూహంలో భాగంగానే సాయిరెడ్డి అలా వ్యవహరించారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. గంటా విషయంలో సాయిరెడ్డి ఏ నిర్ణయం తీసుకోవడం లేదు.ఫలితంగా ఆయన ఎటూ కాకుండా ఉండిపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా గంటా కూడా నోరు మెదపడం లేదు. దీంతో ఆయన ాజకీయ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటు టీడీపీలో చురుకుగా లేకుండా అటు వైసీపీలో చేరకుండా గంటా తటస్థటంగా ఉంటున్నారు. గంటాకు మునుపున్న ఫాలోయింగ్ ఇప్పుడు లేదని తెలుస్తోంది. అందుకే టీడీపీ సైతం పట్టించుకోవడం మానేసిందని చెబుతున్నారు. వైసీపీ పన్నిన వలలోగంటా చిక్కుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆయన రాజకీయ భవితవ్యం రసకందాయంలో పడింది.