Team India Bangladesh Tour: ఆగస్ట్ లో బంగ్లాదేశ్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత్ పర్యటించాల్సి ఉంది. బంగ్లాదేశ్ లో అనిశ్చిత రాజకీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టీమ్ ఇండియా అక్కడికి వెళ్లడం కష్టమేనని సమాచారం. ఈ విషయంలో బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఆగస్ట్ 17 నుంచి వన్డే సిరీస్ జరగాలి. కానీ అక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడంతో ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.