team india weakness : దక్షిణాఫ్రికా ప్లేయర్ల మీద చోకర్ అనే ముద్ర ఉండేది. ఎందుకంటే ఒత్తిడిలో వారు తీవ్రంగా ఇబ్బంది పడతారు. పరుగులు చేయడంలో అవస్థలు పడతారు. ఫలితంగా ఊహించని ఓటములు ఎదుర్కొంటారు. 2024 t20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జరిగింది.
జట్టు లోపాల మీద దృష్టి సారించిన మేనేజ్మెంట్.. అనేక ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగం విజయవంతమైంది. అందువల్లే 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మీద విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు వరుసగా దూసుకుపోతోంది. ముఖ్యంగా మన మీద టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించి సంచలనం సృష్టించింది. అది కూడా మన దేశంలో నిర్వహించిన టెస్ట్ సిరీస్ కావడం విశేషం.
టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నప్పుడు టీమిండియా బ్యాటర్ల మీద.. వారి శైలి మీద దక్షిణాఫ్రికా బౌలర్లకు ఒక అవగాహన వచ్చింది. ముఖ్యంగా షార్ట్ పిచ్ డెలివరీలను టీమ్ ఇండియా ప్లేయర్లు సమర్థవంతంగా ఎదుర్కోలేరని దక్షిణాఫ్రికా బౌలర్లు గుర్తించారు. అందువల్లే అహ్మదాబాద్ మైదానంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో పదేపదే అదే బంతులను వేశారు. దీంతో టీమ్ ఇండియా బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ వంటి ప్లేయర్లు అలానే అవుట్ అయ్యారు.
భారత బ్యాటర్ల లోపం తెలుసు కాబట్టి దక్షిణాఫ్రికా బౌలర్లు పదేపదే అదే బంతులను వేశారు. ముఖ్యంగా యాన్సన్ అద్భుతమైన బంతులు వేశాడు. 3.5 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అతడు 22 పరుగులు ఇచ్చి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీనిని బట్టి టీమిండియా బ్యాటర్ల బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్లో రబడా మాత్రమే ఓవర్ కు 8 పరుగులు ఇచ్చాడు. మిగతా బౌలర్లు మొత్తం 5.7 లోపే పరుగులు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా భాష్ బౌలింగ్లో పరుగులు తీయడానికి టీమిండియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అతడు 3 ఓవర్లు వేసి, 12 పరుగులు ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజు మూడు ఓవర్లు వేసి, 24 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడు.
అహ్మదాబాద్ పిచ్ ను నల్లమట్టితో రూపొందించారు. బంతి స్వింగ్ అవుతుందని తెలుసు. అలాంటప్పుడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ దానికి తగ్గట్టుగా తన జట్టు ఆటగాళ్లను తయారు చేయాల్సి ఉండేది. అలాకాకుండా.. బంతిని అంచనా వేయకుండా.. పిచ్ గురించి బాగా తెలిసినట్టు ఆటగాళ్లు వ్యవహరించారు. ఫలితంగా దారుణమైన మూల్యాన్ని చెల్లించుకున్నారు. టీమ్ ఇండియా టి20 చరిత్రలోనే దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. 76 పరుగుల తేడాతో కూటమి అంటే మామూలు విషయం కాదు. ఇదే దక్షిణాఫ్రికా జట్టును ఆఫ్ఘనిస్తాన్ జట్టు సూపర్ ఓవర్ దాక తీసుకొచ్చింది. కానీ అదే భారత్ 76 పరుగుల తేడాతో.. అది కూడా సొంత దేశంలో ఓడిపోయింది..