Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి

ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 57 వ డివిజన్ లో ని సమ్మయ్య నగర్ లో పోలింగ్ బూత్ కేటాయించారు. శుక్రవారం ఉదయం పోలింగ్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో రమేష్ బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దవాఖానకు తరలించేలోపే ఆయన చనిపోయారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular