
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారిక ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. దీంతో ఆయన ఖాతాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మాజీ సీఎం పళనిస్వామి ట్విటర్ అకౌంట్ ను స్టాలిన్ కు బదిలీ చేసే ప్రక్రియలో ఈ సమస్య తలెత్తినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. అయితే, ప్రస్తుతం తన వ్యక్తిగత ట్విటర్ ఖాతా ద్వారా స్టాలిన్ అధికారిక సమాచారాన్ని చేర్ చేస్తున్నారు.