Tamil Nadu election results 2026 : తమిళనాడులో మళ్లీ పరిణామాలు మారిపోతున్నాయి. దీంతో ఎగ్జిట్‌పోల్స్‌కు తమిళనాడు ఓటరినాడి అందనట్లు అర్థమవుతోంది. అందరూ బెంగాల్ ఎన్నికల ఫలితాలై ఆసక్తిగా చూస్తే.. తమిళనాడు ఫలితాలు అంతకు మించి ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీ టీవీకే అనూహ్యంగా దూసుకుపోతోంది. 97 స్థానాల్లో లీడ్‌లోకి వచ్చింది. ఇక రెండో స్థానంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక అధికార డీఎంకే 49 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
తండ్రీ కొడుకు వెనుకంజ..
ఇక ఈ ఎన్నికల ఫలితాల్లో సీఎం స్ఠాలిన్ 886 ఓట్లతో వెనుకబడ్డారు. టీవీకే అభ్యర్థి బాబు ముందంజలో ఉన్నారు. ఇక సీఎం తనకుడు ఉదయ్‌నిధి స్టాలిన్ కూడా వెనుకబడడ్డారు. ఆయనపైనా టీవీకే పార్టీ అభ్యర్థి లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఇదే సమయంలో స్టాలిన్, ఉదయ్‌నిధి స్టాలిన్‌తోపాటు మరో 26 మంది మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు.
తిరుమలలో త్రిష పూజలు..
ఇదిలా ఉంటే కౌంటింగ్ కొనసాగుతున్న వేళ సినీనటి త్రిష తిరుమలకు వచ్చారు. విజయ్‌కు మద్దతుగా ఉన్నత్రిష తిరుమలలో టీవీకే విజయం సాధించాలని పూజలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత త్రిష–విజయ్ పెళ్లి చేసుకుంటారని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో టీవీకే ముందంజలో ఉండడం ఆసక్తి రేపుతోంది. పోలింగ్ రోజు కూడా త్రిష తాను ఓటు వేసిన తర్వాత విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలిసేలా ఒక ఫోటో ఇన్‌స్టాలో పోస్టు చేశారు. తాజాగా ఫలితాల రోజు తిరుమలలో పూజలు చేయడం ఆసక్తి రేపుతోంది.