Homeజాతీయ వార్తలుAIADMK comeback Tamil Nadu : తమిళనాడులో పుంజుకున్న అన్నా డీఎంకే..

AIADMK comeback Tamil Nadu : తమిళనాడులో పుంజుకున్న అన్నా డీఎంకే..

AIADMK comeback Tamil Nadu తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బలాబలాలు మారుతున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ముగిసింది. ఈవీఎం కౌంటింగ్‌ మొదలైంది. దీంతో ఆధిక్యాలు తారుమారవుతున్నాయి. ఈవీఎం కౌంటింగ్‌ తర్వాత టీవీకే పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా ఆధిక్యం కనబరుస్తోంది. 88 స్థానాల్లో విజయ్‌ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది.

పుంజుకున్న ఏఐఏడీఎంకే
ఇక పోస్టల్‌ బ్యాలెట్‌లో వెనుకబడిన ఏఐఏడీఎంకే.. ఈవీఎం కౌంటింగ్‌ తర్వాత పుంజుకుంది పోస్టల్‌ బ్యాలెట్‌లో రెండో స్థానంలో ఉన్న అన్నా డీఎంకే ఈవీఎం కౌంటింగ్‌లోనూ డీఎంకేను అధిగమించింది. రెండో స్థానంలో కొనసాగుతోంది. 59 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

మూడో స్థానానికి డీఎంకే..
ఇక తమిళనాడులో అధికార డీఎంకే మూడో స్థానానికి వెళ్లింది. 26 శాతం ఓట్లతో ప్రస్తుతం 50 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ మూడోస్థానంలో ఉంది. టీవీకే 89 స్థానల్లో ఆధిక్యం కనబరుస్తూ స్పష్టమైన లీడ్‌ దిశగా దూసుకుపోతోంది. అన్నాడీఎంకే 60 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. డీఎంకే 51 స్థానాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

గంటగంటకూ మారుతున్న లీడ్‌..
ఇక ప్రస్తుత పరిస్తితిని పరిశీలిస్తే.. తమిళనాడులో లీడ్‌ గంట గంటకూ మారుతోంది. పోస్టల బ్యాలెట్‌లో అధికార పార్టీకి ఉద్యోగులు జై కొట్టారు. కానీ ఈవీఎం కౌంటింగ్‌లో ప్రజల తీర్పు వస్తోంది. దీంతో లీడ్‌ ఒక్కసారిగా తారుమారైంది.

టీవీకే, అన్నాడీఎంకే కలిస్తే..
ఇక కౌంటింగ్‌ ముందు నుంచి ఎన్డీఏలోకి టీవీకేను చేర్చుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్స్‌ ప్రకారం చూస్తే కౌంటింగ్‌ తర్వాత అన్నా డీఎంకే, టీవీకే కలిసే అవకాశం కనిపిస్తోంది. డీఎంకేను అడ్డుకునేందుకు రెండు పార్టీలు చేతులు కలిపే అవకాశం కనిపిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular