
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులతో మాట్లాడుతున్నామని పరిస్థితులన్ని త్వరలోనే సర్దుకుంటాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డిన షబ్బీర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కొద్దిసేపు నేతలిరువురూ ఏకాంతంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సిఫాయిలుగా పనిచేయాల్సిన సమయం ఇది అని చెప్పారు.