
ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకం విధివిధానాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీ కార్యాచరణ సిద్ధం చేస్తు్నట్లు చెప్పారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాలని కోరారు.