
ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధం ముగిసినట్లు తాలిబన్లు ప్రకటించారు. కాబూల్ లో అధ్యక్ష భవనాన్ని చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు ఈ ప్రకటన చేశారు. అధ్యక్ష భవనంలోనే తాలిబన్ నేతలు చర్చలు నిర్వహించారు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లడంతో అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు వేలాది మంది పౌరులు ఆఫ్గన్ విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి బారులు తీరారు. ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాయిద్దిన్ లకు ఇవాళ ఓ గొప్ప దినమని, 20 ఏళ్లుగా చేసిన త్యాగాలకు వాళ్లు ఫతిలాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు తాబిబన్ పొలిటిక్ ఆఫీస్ ప్రతినిధి మొహమ్మద్ నయూయ్ తెలిపారు.