https://oktelugu.com/

సునీల్ కుమర్ పై చర్యలు తీసుకోండి.. కేంద్ర హోంశాఖ

ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్ కుమార్ వ్యవహారంలో వచ్చిన మూడు ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై వివరాలు కోరుతూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ లేఖ రాశారు. సునీల్ కుమార్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో వైకాపా ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదు, సునీల్ ప్రసంగ […]

Written By: , Updated On : July 3, 2021 / 04:13 PM IST
Follow us on

ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్ కుమార్ వ్యవహారంలో వచ్చిన మూడు ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై వివరాలు కోరుతూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ లేఖ రాశారు. సునీల్ కుమార్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో వైకాపా ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదు, సునీల్ ప్రసంగ వీడియోలను కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి పంపించింది. ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.