రెండు రాష్ట్రాల ఆధిపత్య పోరు వెనుక ఆంతర్యమేమిటి?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దూరం పెరిగిపోతోంది. గతంలో ఇద్దరు స్నేహితులుగా వ్యవహరించినా ప్రస్తుతం విభేదాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్, జగన్ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లారు. దీనికి కారణాలేవైనా ప్రస్తుతం పరిస్థితి మాత్రం బాగోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ జగన్ తో దోస్తీ కట్టారు. వైఎస్సార్ సీపీ కోసం ప్రచారం సైతం చేశారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ మధ్య […]

Written By: Srinivas, Updated On : July 3, 2021 4:41 pm
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దూరం పెరిగిపోతోంది. గతంలో ఇద్దరు స్నేహితులుగా వ్యవహరించినా ప్రస్తుతం విభేదాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్, జగన్ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లారు. దీనికి కారణాలేవైనా ప్రస్తుతం పరిస్థితి మాత్రం బాగోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ జగన్ తో దోస్తీ కట్టారు. వైఎస్సార్ సీపీ కోసం ప్రచారం సైతం చేశారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ మధ్య వారి మధ్య వైరం పెరుగుతోంది.

గతంలో వీరి మధ్య భేటీలు, ఆలింగనాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. రెండు రాష్ట్రాల మధ్య విభజన పంచాయతీలు, జల జగడాలు పెట్రేగుతున్నాయి. అటు టీఆర్ఎస్ నాయకులు, ఇటు వైసీపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరికి ఎవరిని నిందించాలో తెలియడం లేదని ఇరు పార్టీల నేతలు వక్కాణిస్తున్నాయి. దీంతో వీటి మధ్య సంబంధాలు బెడిసికొడుతున్నాయి.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కేంద్రం కోర్టులోకి బంతిని నెడుతున్నాయి. తెలంగాణ మంత్రులు సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ ను మించిన గజదొంగ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలుఉన్నారని వారిని కాపాడుకునేందుకే ఏం మాట్లాడలేకపోతున్నామని జగన్ పదేపదే చెప్పడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నసందర్భంలో జగన్ తో స్నేహానికి మొగ్గుచూపినా తరువాత ఏమైందో కానీ ఇద్దరి మధ్య సఖ్యత చెడిపోయింది. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. విభజన హామీల విషయంలో జగన్ కాస్త మొండిగానే వ్యవహరిస్తున్నా జగన్ పై మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య పంచాయతీ పెద్దదవుతోంది. ఇద్దరు పట్టువదలని విక్రమార్కులే. సమ ఉజ్జీలే. తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకుంటున్న వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. చివరికి ఎక్కడికి వెళతాయో తెలియడం లేదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.