
నేటి నుంచి తెలంగాణలో పది రోజుల పాటు కఠిన లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఉంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలు కానుండగా ఈ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించింది. ఇక పది రోజుల పాటు వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.