
జూనియర్ రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఒక అనుచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం ప్రాంతాలను మారస్తూ దాక్కుంటున్న సుశీల్ కుమార్ ను ఎట్టకేలకు న్యూఢిల్లీ పోలీసులు పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించేందుకు ట్రాన్సిట్ వారంట్ పై ఢిల్లీకి తీసుకు వస్తున్నారు. హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న రెజ్లర్ సుశీల్ కుమార్ పై లక్ష రూపాయలు, సహచరుడు అజయ్ పై రూ. 50 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు.