
భారత అగ్రశేణి రెజ్లర్ సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు. దిల్లీలోని రోహిణి కోర్టులో మధ్యాహ్నం తర్వాత అతడి బెయిల్ పై విచారణ జరగనుందని సమాచారం. సాగర్ దంకడ్ అనే యువ రెజ్లర్ హత్య కేసులో అతడిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఛత్రసాల్ స్టేడియంలో కొన్నాళ్ల క్రితం సాంగర్ దంకడ్పై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆ యువ రెజ్లర్ మరణించాడు. అప్పటి నుంచి సుశీల్ కుమార్ పోలీసులకు కంట పడకుండా తప్పించుకొన తిరుగుతున్నాడు. మూడు రోజుల క్రితం దీల్లీ పోలీసులు సుశీల్ పై లుకౌటట్ నోటీసులు జారీ చేశారు. ఇన్నాళ్లూ తప్పించుకొని తిరిగిన సుశీల్ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడని తాజాగా తెలిసింది.