
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితానిని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సిద్ధార్థ్ అరెస్ట్ పై తాజాగా ఎన్సీబీ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఈ నెల 26 న విచారణకు హాజరుకావాలని సిద్ధార్థ్ కు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో సిద్ధార్థ్ ను అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై ముంబైకి తరలించి ముంబై కోర్టులో సిద్ధార్థ్ ను హాజరుపరిచాం. కోర్టు జూన్ 1 వరకూ సిద్ధార్థ్ ను కస్టడీలో కి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది అని తెలిపింది.