
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత, రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ సరఫరాలను పర్యవేక్షించాలని సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ను సర్వన్నత న్యాయస్థానం కోరింది. ఆక్సిజన్ అందక ప్రజలు మరణిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలోకరోనా వైరస్ సంక్షోభం, లాక్డౌన్ లను ప్రకటించేందకు హైకోర్డుల అధికారంపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.