
ప్రేమించడం లేదనే కోపంలో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆపై అదే కత్తితో తానూ పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో ఇవాళ మధ్యాహ్నం ఘటన జరిగింది. బాపూజీనగర్ కు చెందిన యువతిని భారత్ నగర్ కు చెందిన గిరీష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించాడు. ఆమె ప్రేమకు నిరాకరించడంతో ఈ మధ్యాహ్నం ఇంటికి వచ్చి కత్తితో దాడి చేశాడు. యువతి కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు రావడాన్ని గమనించి తానూ అదే కత్తితో పొడుచుకున్నాడు. స్థానికులు ఇద్దరిని సమీపంలో ని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.