
వెంకటేశ్ నటించిన నారప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై గత కొన్ని రోజుల నుంచి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారప్ప విడుదల విషయంలో నెలకొన్న వివాదంపై తాజాగా సురేశ్ బాబు స్పందించారు. సొంత బ్యానర్ సురేశ్ ప్రొడెక్షన్ లో నిర్మించే సినిమాలు నా నిర్ణయం మేరకే విడుదలవుతాయి. కానీ నారప్ప సనిమా నిర్మాణంలో మేము కేవలం భాగస్వాములం మాత్రమే. కరోనా మూడో వేవ్ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రసుత్తం ఉన్న పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యుల్నే థియేటర్ కు పంపించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని అడగడం న్యాయమా? అని అన్నారు. భవిష్యత్తు ఓటీటీదే కావొచ్చు కానీ థియేటర్లు కూడా ఉంటాయి. అని సురేష్ బాబు స్పష్టత నిచ్చారు.