మా ఎన్నికలు: మంచు విష్ణు, బాలయ్యకు నాగబాబు కౌంటర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల లొల్లి ముదురుతోంది. ఇటీవలే అగ్రహీరో బాలక్రిష్ణ ‘మా’ కోసం ఒక ఎకరం కూడా సంపాదించలేకపోయారని.. గతంలో వసూలు చేసిన విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమెరికాలో ఫ్టైట్ లో వెళ్లి అక్కడ హీరోలతో చేసిన కార్యక్రమాల వల్ల వచ్చిన కోట్ల రూపాయలు ఏమయ్యాయని బాలయ్య ప్రశ్నించారు. ఇక ‘మా’ ఎన్నికల్లో తన మద్దతు ‘మంచు విష్ణు’ కంటూ మా భవనం కోసం తాను సాయం చేస్తానని బాలయ్య ప్రకటించారు. మా భవనం […]

Written By: NARESH, Updated On : July 17, 2021 5:01 pm
Follow us on

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల లొల్లి ముదురుతోంది. ఇటీవలే అగ్రహీరో బాలక్రిష్ణ ‘మా’ కోసం ఒక ఎకరం కూడా సంపాదించలేకపోయారని.. గతంలో వసూలు చేసిన విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమెరికాలో ఫ్టైట్ లో వెళ్లి అక్కడ హీరోలతో చేసిన కార్యక్రమాల వల్ల వచ్చిన కోట్ల రూపాయలు ఏమయ్యాయని బాలయ్య ప్రశ్నించారు. ఇక ‘మా’ ఎన్నికల్లో తన మద్దతు ‘మంచు విష్ణు’ కంటూ మా భవనం కోసం తాను సాయం చేస్తానని బాలయ్య ప్రకటించారు.

మా భవనం కోసం సేకరించిన విరాళాలు ఏమయ్యాయో చెప్పాలన్న బాలయ్య వ్యాఖ్యలకు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని.. భవనం కోసం నిర్మించడానికి కాదని స్పష్టం చేశారు.

మా భవనం కోసం గత అధ్యక్షుడు మురళీ మోహన్ ఎంతో ప్రయత్నించారని.. కానీ రాజకీయ కారణాల వల్ల అది సఫలం కాలేదన్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్లు విరాళాలు సేకరించినా అది సభ్యుల సంక్షేమం, ఇతర కారణాలపై దృష్టి సారించడంతో ఖర్చు అయిపోయాయన్నారు. ప్రకాష్ రాజ్ కు మా’ను ఐక్యంగా ఉంచి భవనం నిర్మించడానికి ఒక విజన్ ఉందని.. అందుకే తాను ప్రకాష్ రాజ్ కు సపోర్టు చేస్తున్నానని నాగబాబు తెలిపారు.

మా ఎన్నికలు ఏకగ్రీవం చేయాలన్న మంచు విష్ణు వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ఏకగ్రీవం చేయాలనుకోవడం మంచి పద్దతి కాదని.. ఏం అంశంలోనైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని సూచించారు. ఏకగ్రీవం చేయాలనుకుంటే అందరూ తప్పుకొని ప్రకాష్ రాజ్ ను అధ్యక్షుడిని చేయాలని సూచించారు. ఎవరు గెలిచినా అందరం కలిసి పనిచేస్తామని నాగబాబు స్పష్టం చేశారు.