https://oktelugu.com/

సీబీఎస్ఈ పరీక్షల రద్దుపై సుప్రీం విచారణ వాయిదా

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా 12వ తరగతి పరీక్షల రద్దుకు సీబీఎస్ఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతా శర్మ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పటిషన్ ను స్వీకరించిన జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను మే 31వ తేదీ కి వాయిదా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 28, 2021 / 12:01 PM IST
    Follow us on

    సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా 12వ తరగతి పరీక్షల రద్దుకు సీబీఎస్ఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతా శర్మ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పటిషన్ ను స్వీకరించిన జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను మే 31వ తేదీ కి వాయిదా వేసింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను జూన్ 1న ఖరారు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.