25 కోట్ల ఉచిత టీకాల సరఫరా.. కేంద్రం

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచితంగా 25 కోట్ల వ్యాక్సిన్లు అందజేసిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1.3 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మరో 3 లక్షలపైగా టీకాలు పంపించనున్నట్లు వెల్లడించింది. మే 1న వ్యాక్సినేషన్ మూడో దశ ప్రారంభం కాగా, జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా […]

Written By: Suresh, Updated On : June 9, 2021 7:07 pm
Follow us on

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచితంగా 25 కోట్ల వ్యాక్సిన్లు అందజేసిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1.3 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మరో 3 లక్షలపైగా టీకాలు పంపించనున్నట్లు వెల్లడించింది. మే 1న వ్యాక్సినేషన్ మూడో దశ ప్రారంభం కాగా, జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా ఇవ్వనుందని సోమవారం ప్రధాని మోదీ ప్రకటించారు.