https://oktelugu.com/

బాలక్రిష్ణ బర్త్ డే స్పెషల్.. అభిమానులకు సర్ ప్రైజ్

నటసింహం బాలయ్య.. పరాక్రమ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇద్దరూ ఉద్దండులే. వీరిద్దరిది మాస్ స్టైల్.ఇద్దరూ కలిసి తీసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందుకే మూడోసారి ‘అఖండ’ మూవీతో వీరిద్దరూ జతకట్టారు. ప్రముఖ నటుడు నందమూరి బాలక్రిష్ణ పుట్టినరోజు జూన్ 10 సందర్భంగా ఆయన అభిమానులకు సర్ ప్రైజ్ ను ఇచ్చారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. బాలయ్యను హీరోగా పెట్టి తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. తాజాగా చిత్రబృందం బాలయ్య బర్త్ డే […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2021 / 06:56 PM IST
    Follow us on

    నటసింహం బాలయ్య.. పరాక్రమ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇద్దరూ ఉద్దండులే. వీరిద్దరిది మాస్ స్టైల్.ఇద్దరూ కలిసి తీసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందుకే మూడోసారి ‘అఖండ’ మూవీతో వీరిద్దరూ జతకట్టారు.

    ప్రముఖ నటుడు నందమూరి బాలక్రిష్ణ పుట్టినరోజు జూన్ 10 సందర్భంగా ఆయన అభిమానులకు సర్ ప్రైజ్ ను ఇచ్చారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. బాలయ్యను హీరోగా పెట్టి తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. తాజాగా చిత్రబృందం బాలయ్య బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

    కళ్లద్దాలు పెట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ బాలయ్య కనిపిస్తున్న పోస్టర్ ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఇది విడుదలైన కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో బాలక్రిష్ణ సరసన ప్రగ్యాజైస్వాల్ నటిస్తోంది. శ్రీకాంత్, జగపతి బాబు కీలక పాత్రధారులు.

    తమన్ అందిస్తున్న సంగీతం ఆకట్టుకుంటోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై రవీందర్ రెడ్డి మిర్యాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ జోడీ తీసిన ‘సింహా’, లెజెండ్ చిత్రాలు ఘన విజయం అందుకోవడంతో ‘అఖండ’ఫై భారీ అంచనాలున్నాయి.