https://oktelugu.com/

అమెరికాలో తప్పిపోయిన చిరంజీవి !

అది 1988 నాటి కాలం.. సుప్రీమ్ హీరో నుండి చిరంజీవి, మెగాస్టార్ గా మారుతున్న రోజులు అవి. అందుకే చిరు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పని చేసుకుంటూ పోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే వరుసగా హిట్స్ వస్తున్నాయి. నిర్మాతలు చిరు డేట్స్ కోసం ఎగబడ్డారు. ఎవరిని కాదనలేని పరిస్థితి. అందుకే కష్టం అని తెలిసినా, చిరంజీవి సమయానికి మించి సినిమాలు ఒప్పుకున్నారు. దాంతో చిరు వరుస షూటింగ్స్‌ తో చాలా బిజీగా గడుపుతున్న రోజులవి. అలాగే […]

Written By: , Updated On : June 9, 2021 / 07:14 PM IST
Follow us on

Chiranjeeviఅది 1988 నాటి కాలం.. సుప్రీమ్ హీరో నుండి చిరంజీవి, మెగాస్టార్ గా మారుతున్న రోజులు అవి. అందుకే చిరు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పని చేసుకుంటూ పోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే వరుసగా హిట్స్ వస్తున్నాయి. నిర్మాతలు చిరు డేట్స్ కోసం ఎగబడ్డారు. ఎవరిని కాదనలేని పరిస్థితి. అందుకే కష్టం అని తెలిసినా, చిరంజీవి సమయానికి మించి సినిమాలు ఒప్పుకున్నారు. దాంతో చిరు వరుస షూటింగ్స్‌ తో చాలా బిజీగా గడుపుతున్న రోజులవి.

అలాగే నెలలు తరబడి పని చేసిన చిరు మనసు, శరీరం రెండూ కొంత విశ్రాంతిని కోరుకున్నాయి. ఇండియాలో ఉంటే కచ్చితంగా ఏ నిర్మాతో చేయమని వెంట పడతాడు. అందుకే, సరదాగా విదేశాలకు వెళితే బెటర్ అని నిర్ణయించుకున్నారు చిరు. ఆ సమయంలోనే అమెరికా వెళదామని కె.ఎస్.రామారావు ప్రపోజ్ చేశారు. అలా తన స్నేహితులతో కలిసి అమెరికా యాత్రకు బయలుదేరారు చిరు.

అప్పటికే చిరంజీవి ఒకసారి అమెరికా వెళ్లారు. అది రెండోసారి. మొత్తానికి 1989 మేలో చిరు అమెరికా యాత్ర సరదాగా మొదలైంది. ఈ ప్రయాణంలో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, అల్లు అరవింద్ దంపతులు, నిర్మాత కె.ఎస్.రామారావు దంపతులు కూడా ఉన్నారు. అందరు అమెరికా చేరుకున్నారు. అక్కడ చిరు పెట్టిన కండిషన్ ఏమిటంటే… అమెరికాలో మనం సెలబ్రిటీల్లా కాకుండా సింపుల్‌గా గడపాలంటూ చిరు షరతు పెట్టారు.

ఆ షరతు కారణంగా ఎక్కడకు వెళ్లినా అందరూ నడిచే వెళ్లారట. అలా కిలోమీటర్ల దూరం కొద్దీ నడవలేక రోడ్డు పక్కనే కూర్చున్నారట. అయితే దూరప్రాంతాలకు మాత్రం ఏదైనా వెహికల్ లో వెళ్లొచ్చు. కానీ కార్లలో వెళ్ళకూడదు. అందుకే సామాన్య ప్రజలతో కలిసి బస్సుల్లోనే ప్రయాణించారట. ఆ సమయంలో ఏసీ బస్ ఎక్కిన కాసేపటికే చిరంజీవి నిద్రపోయారు.

దిగాల్సినచోట వచ్చి అందరూ దిగేశారు ఒక్క చిరు తప్ప. మొత్తానికి చిరు నిద్రలోనే అలా ముందుకు వెళ్లిపోయి తప్పిపోయారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా కంగారుపడి వెతుకుతూ ,రెండు కిలోమీటర్ల ఆవతల చిరు నవ్వుతూ కనిపించారట.