
రాష్ట్రంలో కరోనా కట్టడికి మే 12 వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి బీఎస్ యూడియూరప్ప కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో బాధితులకు అవసరం లేకున్నా రెమెడెసివిర్ వ్యాక్సిన్ ఇస్తున్నారని, ఇది సరైంది కాదని, అవసరమైన వారికి మాత్రమే ఇవ్వాలని సూచించారు.