Homeక్రైమ్‌street dogs attack : చూస్తుండగానే దాడి చేసింది.. కాసేపైతే ప్రాణాలు పోయేవే.. ఊర కుక్కల...

street dogs attack : చూస్తుండగానే దాడి చేసింది.. కాసేపైతే ప్రాణాలు పోయేవే.. ఊర కుక్కల అభిమానులకు ఈ వీడియో అంకితం!

street dogs attack : ఈ భూమ్మీద బతికే హక్కు కేవలం మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. అలాగని ఇతర జంతువుల మీద మూర్ఖంగా దాడి చేస్తే ఎవరూ దానిని సహించరు. ఉదాహరణకు పులిని ఎవరైనా చంపడానికి ప్రయత్నిస్తే.. లేదా చంపేస్తే.. వారిని శిక్షిస్తారు. అలాగే మనుషుల మీద దాడికి పాల్పడే జంతువులకు కూడా ఇదే వర్తిస్తుంది…

మనదేశంలో ఊర కుక్కల బెడద కొంతకాలంగా ఉంది. ఏకంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై స్పందించింది. ఊర కుక్కల సంతతి పెరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఊర కుక్కలు దాడి చేసినప్పుడు.. బాధితులకు రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలని.. ఆ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని అనేక సందర్భాలలో సూచించింది.

కొన్ని ప్రాంతాలలో ఊర కుక్కలను నిర్మూలించడానికి పాలకవర్గాలు సంహారం అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాయి. ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు జంతు ప్రేమికులు ఆందోళనలు చేస్తూ ఉంటారు. ఊర కుక్కలను అభిమానించేవారు ఆందోళనలు చేపడుతూ ఉంటారు. వాస్తవానికి ఆ ఊర కుక్కలు మీద పడి దాడి చేస్తే అప్పుడు తెలుస్తుంది వారికి.

ఊర కుక్కలు తీవ్రమైన ప్రవర్తనతో ఉంటాయి. వాటి లాలాజలంలో రేబిస్ వైరస్ ఉంటుంది. రేబిస్ వైరస్ ప్రాణాంతకమైనది. సకాలంలో వైరస్ నివారణకు యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేసుకోకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందువల్లే ఊర కుక్కలు దాడి చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. రేబిస్ వ్యాక్సిన్ వేసుకోకపోతే ప్రాణాలు కూడా పోతాయి. ఇటీవల మన దేశంలో అక్కడక్కడా రేబిస్ మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

ఊర కుక్కల వల్ల ఎంతటి ప్రమాదకరమో ఓ వీడియో నిరూపిస్తోంది.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో విస్తృతమైన చర్చకు దారి తీస్తోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ఓ మహిళ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా.. ఓ ఊర కుక్క ఆమెపై దాడి చేసింది. ఆమెను కింద పడేసింది. మెడ భాగంలో కరవడానికి ప్రయత్నించింది. కానీ ఇంతలోనే ఓ వ్యక్తి రావడంతో కుక్క పారిపోయింది.. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఊర కుక్కల అభిమానులకు ఈ వీడియో అంకితం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular