
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మళ్లీ కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు ఫ్టాట్ గా ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 74.23 వద్ద ముగిసింది. ఉదయం 56,067 పాయింట్ల వద్ద లాభాల్లోనే ఆరంభమైంది. చివరకు 14 పాయింట్ల నష్టంతో 55,944 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 10 పాయింట్లు పెరిగి 16,634 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో సగానికిపైగా షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా బజాజ్ ఫిన్ సర్వ్ 3.29 శాతం నష్టపోయింది.