https://oktelugu.com/

Balakrishna : బాలయ్య చేసిన రౌడీ ఇన్ స్పెక్టర్ ను రీమేక్ చేయనున్న స్టార్ హీరో..?

ఇక పటాస్ సినిమా స్క్రిప్ట్ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి తను ఈ సినిమాని చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది... ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి హీరోలందరూ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : March 26, 2024 / 09:16 PM IST

    Rowdy Inspector Movie

    Follow us on

    Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చే పేరు నందమూరి తారక రామారావు… ఎందుకంటే ఆయన చేసిన సేవల వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఈ రేంజ్ లో కొనసాగుతుంది. ఒకప్పుడు ఎంతోమంది తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళందరికీ సమాధానం చెబుతూ ఆయన వరుస సినిమాలు చేస్తూ సౌత్ సినిమా ఇండస్ట్రీ అన్నింటిలో తెలుగు సినిమాని ఒక లెవెల్ కి తీసుకొచ్చాడనే చెప్పాలి.

    ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన నట వారసుడిగా ఇండస్ట్రి కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు కూడా మంచి విజయాలు అందుకొని తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు రౌడీ ఇన్ స్పెక్టర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాని బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది అయితే ఈ సినిమాని రీమేక్ చేయాలని చాలామంది బాలయ్య బాబు అభిమానులు కోరుతున్నారు. అయితే ఈ సినిమాని రీమేక్ చేసే బాధ్యతని తీసుకుంటాడని చాలామంది అనుకున్నారు.

    కానీ ఎన్టీఆర్ ఉన్న బిజీ వల్ల ఆయన ఏ సినిమా చేసే అవకాశం అయితే లేదు. అందువల్లే కళ్యాణ్ రామ్ ఈ సినిమాని రీమేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని కనక కళ్యాణ్ రామ్ తో తెరకెక్కిస్తే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అని అభిప్రాయపడే వారు కూడా ఉన్నారు. అయితే కళ్యాణ్ రామ్ ఇంతకుముందే పటాస్ లాంటి సినిమాను చేసి సూపర్ హిట్ గా మార్చాడు.

    ఇక పటాస్ సినిమా స్క్రిప్ట్ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి తను ఈ సినిమాని చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి హీరోలందరూ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు…