Sudhirgali Sudheer : సుడిగాలి సుధీర్ బుల్లితెర పై ఎంతటి సెన్సేషన్ సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా మొదలై హీరో రేంజ్ కి వెళ్ళాడు. స్మాల్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పి వెండితెర పై రాణిస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్ లో కామెడీ ఓ రేంజ్ లో పండేది. రియల్ లైఫ్ లో కూడా ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.
కొంతకాలంగా గెటప్ శ్రీను, సుధీర్ సినిమాలతో బిజీ కావడంతో రాంప్రసాద్ టీమ్ ను లీడ్ చేస్తున్నాడు. జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలు చేస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో కమెడియన్లు అందరూ వాళ్లకు లైఫ్ ఇచ్చిన వారికి థాంక్స్ చెప్పారు. వారిని స్టేజి పైకి తీసుకు వచ్చారు. ఈ క్రమంలో రాంప్రసాద్ తన జిగిరి దోస్తులు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ని తీసుకొచ్చాడు. వాళ్లిద్దరూ తనకు ఎంతో సహాయం చేశారని చెప్పుకొచ్చాడు.
ఇక గెటప్ శ్రీను, సుధీర్ కూడా రాంప్రసాద్ వల్లే ఈ స్థాయిలో ఉన్నామంటూ ప్రశంసలు కురిపించారు. సుడిగాలి సుధీర్… రష్మీ కి కూడా స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఇంతలో బుల్లెట్ భాస్కర్ మధ్యలో దూరి రచ్చ చేశాడు. ఎప్పటిలానే సుధీర్ పై నోరు పారేసుకున్నాడు. నేను సుధీర్ కి థాంక్స్ చెప్పాలి అంటూ మొదలుపెట్టాడు. నాకు సర్జరీ అయినప్పుడు బాగా కాలి నొప్పి వస్తే థియేటర్ కి వెళ్లి సుధీర్ సినిమా చూసేవాడిని .. అప్పుడు తల నొప్పి వచ్చి ఈ నొప్పి మర్చిపోయేవాడిని అని అన్నాడు.
ఇక తన పిల్లలు సుధీర్ సినిమా వస్తే చాలు థియేటర్ కి వెళ్దాం అని గోల చేస్తున్నారు.. ఎటు ఆ సినిమా ఎవరూ చూడరు, ఖాళీగా ఉంటుంది ఆడుకోవడానికి వెళ్దాం అంటున్నారు అని పంచులు వేశాడు. దీంతో అంతా తెగ నవ్వేశారు. ఇక తనను సుధీర్ ఫ్యాన్స్ దారుణంగా తిడుతున్నారని భాస్కర్ అన్నాడు. కానీ సుధీర్ మాత్రం ఎన్ని మాటలు అన్నా కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడని .. అందుకే వాడి మీద కామెడీ గా పంచులు వేస్తుంటామని భాస్కర్ చెప్పుకొచ్చాడు.