Marajo Island : దొంగతనాలు జరగకుండా.. అసాంఘిక శక్తులు పేట్రేగకుండా.. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అవసరమైతే రాత్రిపూట పెట్రోలింగ్ కూడా చేస్తుంటారు. మనకు తెలిసినంతవరకు పోలీసులు పెట్రోలింగ్ కు వాహనాలనే ఉపయోగిస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో.. పెట్రోలింగ్ కోసం అక్కడి పోలీసులు గేదెలను ఉపయోగిస్తున్నారు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది మాటికి నిజం. ఇంతకీ ఆ దేశం ఏమిటి.. ఎందుకు అక్కడ అలా చేస్తుంటారు.. ఆలస్యమెందుకు మీరే చదివేయండి..
బ్రెజిల్ దేశంలో మరాజే అనే ఒక ద్వీపం ఉంటుంది. ఇది అమెజాన్ నది అట్లాంటిక్ సముద్రంలో కలిసే ప్రాంతంలో ఏర్పడింది. ఈ ద్వీపం పరిమాణం స్విట్జర్లాండ్ దేశమంత ఉంటుంది.. అయితే ఇక్కడ పోలీసింగ్ విధానం విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా పోలీసులు వాహనాలలో తిరుగుతూ గస్తి నిర్వహిస్తుంటే.. ఇక్కడి పోలీసులు మాత్రం నీటి గేదెలు, గుర్రాలపై కస్తి నిర్వహిస్తుంటారు.. మరాజో ద్వీపంలో నీటి గేదెలు విస్తారంగా ఉంటాయి… ఇక్కడ వాతావరణం వాటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గేదెలను వందల ఏళ్ల క్రితమే ఫ్రెంచ్ గయానా దేశస్తులు తీసుకొచ్చారని ఇక్కడి వారు చెబుతుంటారు.
ఈ ద్వీపంలో నాలుగు లక్షల 40 వేల మంది జీవిస్తుంటారు. ఈ ప్రాంతం ఊష్ణ మండల వాతావరణానికి చెందింది.. జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా చిన్నగా ఉన్న ఈ ద్వీపంలో పోలీసులు గేదెలపై లేదా గుర్రాలపై సవారి చేస్తూ భద్రతను పర్యవేక్షిస్తుంటారు. రాత్రిపూట గస్తీ కాస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గేదెలను గస్తీ కోసం మాత్రమే కాకుండా.. వాటిని వధించి ఆ మాంసాన్ని వండుకొని తింటారు. ఈ ప్రాంతంలో బఫెలో స్టిక్స్ అనే వంటకం అత్యంత ప్రసిద్ధి చెందింది. మోజారెల్లా గ్రేసింగ్ రెస్టారెంట్లో బఫెలోస్టిక్స్ ప్రత్యేకంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు.
అయితే పోలీసులకు శిక్షణలో భాగంగా గేదెలపై సవారి నేర్పుతుంటారు. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. బురద నిండిన మడ అడవులలో గేదెలపైకి నూతనంగా రిక్రూట్ అయిన పోలీసులను ఎక్కించి శిక్షణ ఇస్తుంటారు. ఆ గేదెను సవారి చేయడంలో నైపుణ్యం సంపాదించిన వారికి మాత్రమే గస్తీ కాసే బాధ్యత అప్పగిస్తారు. అయితే గేదెను నియంత్రించడం అనేది సవాల్ తో కూడుకున్నదని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారులు చెబుతుంటారు.. ఇలా గేదెలపై పోలీసులు గస్తీ కాస్తుండడం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వింతగా కనిపిస్తుంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందడంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.