
కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ. 47 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,350 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300 వద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నా వెండి మాత్రం కొంత మేర తగ్గాయి. కిలో వెండి ధర రూ. 500 తగ్గి 68,200కి చేరింది.