Homeక్రీడలుక్రికెట్‌Sri Lanka vs Australia : ఆస్ట్రేలియాను ఇంటికి పంపించడమే కాదు.. శ్రీలంక ఎన్ని రికార్డులు...

Sri Lanka vs Australia : ఆస్ట్రేలియాను ఇంటికి పంపించడమే కాదు.. శ్రీలంక ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలుసా?

Sri Lanka vs Australia : మొత్తానికి శ్రీలంక సొంత మైదానంలో దుమ్మురేపింది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో.. భారీ లక్ష్యాన్ని సులువుగా చేదించింది. ఆస్ట్రేలియా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. తద్వారా టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన విజయాన్ని అందుకొని.. సూపర్ 8 లోకి ప్రవేశించింది. అటు జింబాబ్వే.. ఇటు శ్రీలంక చేతిలో ఓడిపోయి.. ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లిపోయింది.

ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా జట్టులో మార్ష్(54), హెడ్(56) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అయితే మిగతా బ్యాటర్లు గ్రీన్ (3), డేవిడ్ (6), స్టోయినీస్(4), కనోలీ(3) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లిస్(27), మాక్స్ వెల్(22) వారి స్థాయికి తగ్గట్టుగా ఆడలేక పోయారు.

ఆస్ట్రేలియా ఓపెనర్లు 8.3 ఓవర్లలో శతక భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత శ్రీలంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు అవుట్ అయ్యారు. 110/2, 116/3, 130/4, 160/5, 174/6, 177/7, 180/8, 180/9, 181/10 ఇలా ఆస్ట్రేలియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో.. భారీ స్కోర్ చేయలేకపోయింది.

ఆ తర్వాత శ్రీలంక జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్ నిస్సాంక (100*), కుశాల్ మెండిస్ (51) సత్తా చూపించడంతో శ్రీలంక జట్టు 18 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 184 పరుగులు చేసింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుతమైన ఘనవిజయాన్ని అందుకుంది. శ్రీలంక బౌలర్లు వికెట్లు తీసిన చోట.. ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఏకంగా ఆరుగురు బౌలర్లను రంగంలోకి దింపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా శ్రీలంక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. శ్రీలంక జట్టు తరఫున వేగవతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిస్సాంక నిలిచాడు. 2025లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కుషాల్ ఫెరీర 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ లో టీమ్ ఇండియా మీద నిస్సాంక 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

నిస్సాంక ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా మరో రికార్డు కూడా అందుకున్నాడు. టి20 ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత పార్కులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతడి కంటే ముందు 2010లో జింబాబ్వే మీద జయవర్ధనే 100, అదే ఏడాది వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో జయవర్ధనే 98* పరుగులు చేశాడు. 2009లో వెస్టిండీస్ జట్టు మీద తిలక్ రత్న దిల్షాన్ 96* పరుగులు చేశాడు.

182 పరుగుల విజయ లక్ష్యాన్ని ఫినిష్ చేయడం టి20 ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టుకు అత్యంత విజయవంతమైన పరుగుల చేదన. ఇది మాత్రమే కాదు టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా పై శ్రీలంక జట్టుకు ఇది హైయెస్ట్ రన్ చేజింగ్.
టి20 లలో బంగ్లాదేశ్, జింబాబ్వేపై కాకుండా వేరే జట్టుపై శ్రీలంక 180+ పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేయడం ఇది తొలిసారి. అంతేకాదు టి20 లలో శ్రీలంక వేదికగా ఏ జట్టుకైనా సరే ఇది సెకండ్ హైయెస్ట్ రన్ చేజింగ్.

మరోవైపు మంగళవారం ఐర్లాండ్ జట్టుతో జరిగే మ్యాచ్లో జింబాబ్వే కనక గెలిస్తే.. ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్ళిపోతుంది. కాగా, నిస్సాంకకు ఆస్ట్రేలియాపై ఇదే తొలి టి20 సెంచరీ.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular