
చాహల్ వేసిన ఈ ఓవర్ లో శ్రీలంక నాలుగు పరుగులు తీసి కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ షనక (39) ధాటిగా ఆడే క్రమంలో లాంగాఫ్ లో హార్దిక్ పాండ్య చేతికి చిక్కాడు. దాంతో ఆ జట్టు 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో టెయిలెండర్లు కరుణరత్నె (9), ఉదన ఉన్నారు.